breaking news
Uyalavada Narasimha Reddy
-
సైరాలో చిరూతో...
...నటించే ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ చెంతకు వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదీ ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా! చిరంజీవి హీరోగా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందుతోన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులో ముగ్గురు నాయికలకు చోటుంది. అంటే... ఉయ్యాలవాడ జీవితంలో ముగ్గురు మహిళలు ప్రముఖ పాత్ర పోషించారట! అందులో ఒకరిగా నయనతారను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడకు చేదోడు వాదోడుగా నిలిచిన యోధురాలిగా ఆమె పాత్ర ఉండనుందట. మిగతా రెండిటిలో... ఒకటి యవ్వనంలో ఉయ్యాలవాడతో ప్రేమలో పడిన అమ్మాయి పాత్ర, ఇంకొకటి శక్తివంతమైన మహిళ పాత్ర అని తెలుస్తోంది. ఆ ప్రేమలో పడిన అమ్మాయి పాత్రకు ప్రగ్యాను తీసుకోవాలనుకుంటున్నారట. మరో పాత్రకు అనుష్క పేరు వినిపిస్తోంది! సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణం! -
ఐదు రోజులు ముందే గుడ్ న్యూస్
చిరంజీవి అభిమానులు తియ్యని కబురు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆయన నటించబోయే 151వ చిత్రం ప్రకటన కోసం కొన్ని నెలలుగా ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్లుగా ఈ చిత్రం కోసం చిరంజీవి కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ 22న ఆయన బర్త్‌డే. ఆ రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో అనుకున్నారు. కానీ, ఐదు రోజులు ముందే ఆ గుడ్ న్యూస్ చెప్పేశారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌పై చిరు తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’, ‘మహావీర’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి.. ఈ రెండిటిలో ఒక టైటిల్‌ని సెలక్ట్ చేస్తారో? వేరే టైటిల్ పెడతారో చూడాలి. -
ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్!
సుదీప్‌కు ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. అందులో విలన్‌గా నటించారీ కన్నడ హీరో. మళ్లీ మరో తెలుగు సినిమాలో ఈయన కీలక పాత్రలో నటించనున్నారని టాక్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తొలి తరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అందులో సుదీప్ విలన్‌గా చేయనున్నారట. కొన్ని రోజుల క్రితమే ‘ఉయ్యాలవాడ...’లో మరో కన్నడ హీరో ఉపేంద్ర విలన్‌గా నటించనున్నారనే వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఆయనతో పాటు సుదీప్నూ ఎంపిక చేశారట! ఆగస్టు 15న ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తారట. ఇందులో విలన్లు ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఆ రోజే చెబుతారేమో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనుకున్నారంతా. ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషలు, హిందీ ప్రేక్షకులు... అందరికీ అర్థమయ్యేలా ‘మహావీర’ అని పెడితే ఎలా ఉంటుందని చిత్రబృందం ఆలోచిస్తోందట. చివరకు ఏ టైటిల్ కన్ఫర్మ్ అవుతుందో... వెయిట్ అండ్ సీ!! -
ఉయ్యాలవాడలోకి వస్తారా?
అనుష్కా శెట్టి, ప్రియాంకా చోప్రా మనసుల్లో ఉయ్యాలవాడలోకి రావాలనుందో? లేదో? గానీ... వీళ్లిద్దర్నీ తీసుకురావాలని చిరంజీవి అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ముగ్గురు కథానాయికలకు చోటుంది. మామూలు కమర్షియల్ సినిమా అయితే... ఎవరో ఒకర్ని ఎంపిక చేసే వీలుంటుంది. కానీ, ఇదేమో చారిత్రక కథతో రూపొందనున్న సినిమా. అందుకే, ఆచి తూచి అడుగులు వేస్తున్నారట! ఆల్రెడీ ఓ హీరోయిన్ క్యారెక్టర్‌కు ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారనే వార్త షికారు చేస్తోంది.మిగతా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు అనుష్క, ప్రియాంకలను సంప్రదించారట! ‘బాహుబలి, రుద్రమదేవి’ సినిమాలతో చారిత్రక సినిమాలకు అనుష్క పర్ఫెక్ట్ అనే పేరొచ్చింది. పైగా, ‘స్టాలిన్’లో చిరు పక్కన ఓ సాంగ్ చేసినప్పుడు ఇద్దరి జోడీ బాగుందన్నారు. ఆల్రెడీ అనుష్కను ‘ఉయ్యాలవాడ..’ టీమ్ అప్రోచ్ అయ్యారట. ఐష్‌తో పాటు మరో హీరోయిన్ పాత్రకు ప్రియాంకను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ వస్తుందనుకుంటున్నారట. మరి, వీళ్లు ఏమంటారో? వీళ్లతో పాటు ‘లింగ’లో రజనీకాంత్‌కు జోడీగా నటించిన హిందీ హీరోయిన్ సోనాక్షీ సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉందట! సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఎవరు ఫైనలైజ్ అవుతారో!! -
ఉయ్యాలవాడలోకి వస్తారా?
అనుష్కా శెట్టి, ప్రియాంకా చోప్రా మనసుల్లో ఉయ్యాలవాడలోకి రావాలనుందో? లేదో? గానీ... వీళ్లిద్దర్నీ తీసుకురావాలని చిరంజీవి అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ముగ్గురు కథానాయికలకు చోటుంది. మామూలు కమర్షియల్ సినిమా అయితే... ఎవరో ఒకర్ని ఎంపిక చేసే వీలుంటుంది. కానీ, ఇదేమో చారిత్రక కథతో రూపొందనున్న సినిమా. అందుకే, ఆచి తూచి అడుగులు వేస్తున్నారట! ఆల్రెడీ ఓ హీరోయిన్ క్యారెక్టర్‌కు ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారనే వార్త షికారు చేస్తోంది. మిగతా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు అనుష్క, ప్రియాంకలను సంప్రదించారట! ‘బాహుబలి, రుద్రమదేవి’ సినిమాలతో చారిత్రక సినిమాలకు అనుష్క పర్ఫెక్ట్ అనే పేరొచ్చింది. పైగా, ‘స్టాలిన్’లో చిరు పక్కన ఓ సాంగ్ చేసినప్పుడు ఇద్దరి జోడీ బాగుందన్నారు. ఆల్రెడీ అనుష్కను ‘ఉయ్యాలవాడ..’ టీమ్ అప్రోచ్ అయ్యారట. ఐష్‌తో పాటు మరో హీరోయిన్ పాత్రకు ప్రియాంకను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ వస్తుందనుకుంటున్నారట. మరి, వీళ్లు ఏమంటారో? వీళ్లతో పాటు ‘లింగ’లో రజనీకాంత్‌కు జోడీగా నటించిన హిందీ హీరోయిన్ సోనాక్షీ సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉందట! సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఎవరు ఫైనలైజ్ అవుతారో!! -
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కమ్ముకున్న తెలుగు తిరుగుబాటు మేఘాలు. ఆ ఉరుములు గర్జించిన ఒకే ఒక్క పేరు... ఉయ్యాలవాడ. తెల్ల గుండెల్లో పిడుగు బల్లెం దింపి ధీర పతాకం ఎగరేసిన నరసింహారెడ్డి ఊరే... ఉయ్యాలవాడ. స్వాతంత్య్ర ఉద్యమానికి ఉయ్యాలలోనే మంత్రోపదేశం చేసిన వీరవాడ! ఆ వాడలో దుమ్ము రేపిన గిట్టల ధూళి సమరయోధుల నుదుటిన రుధిర తిలకంగా అద్దుకుంది. తల... ఉంటే బలమైన బాహువుల మీద ఉండాలి. లేకుంటే... కోట గుమ్మానికి అలంకారం కావాలి. స్ఫూర్తికి ఆహ్వానం కావాలి. మల్లారెడ్డితో పథకం షురూ..! అది 1847వ సంవత్సరం. బ్రిటీష్ దొర కాక్రేన్ నివాసం. అందరూ బానిసలే. చుట్టూ తిరుగుతున్న వారందరూ బానిసలే. ఆ మధ్యలో ఓ పదిమంది తెల్లదొరలు. వారిపక్కనే అందమైన దొరసానులు. ఠప్‌మని బాటిల్ ఓపెన్ అయింది. బందూక్లోనుంచి బుల్లెట్లా వచ్చింది షాంపైన్ బాటిల్ మూత. కోటలోకి వస్తున్న మల్లారెడ్డికి ఎదురైన గన్ సెల్యూట్ అది. దొర బానిసలు దారి చూపించగా, చుట్టూ పరికిస్తూ కాక్రేన్ దొర వద్దకు చేరాడు మల్లారెడ్డి. అక్కడి పార్టీ వాతావరణం,పియానో సంగీతం మల్లారెడ్డికి కొత్తగా అనిపించాయి.‘కమ్ మల్లారెడ్డి.. వెల్కమ్.’ అన్నాడు కాక్రేన్. వంగి వంగి దండాలు పెడుతూ కాక్రేన్‌ను సమీపించాడు మల్లారెడ్డి. ‘ఎంజాయ్ షాంపైన్?’ అంటూ మల్లారెడ్డి చేతికి గ్లాస్ అందించాడు. బుడగలు వేస్తున్న గ్లాసును వింతగా చూశాడు మల్లారెడ్డి. కాక్రేన్... పక్కనే ఉన్న భామతో, ‘మల్లారెడ్డి. మన తె..ల్ల..వా..రికి సాయం చేస్తున్న లె...లు..గువాడు.’ అంటూ మల్లారెడ్డిని చూపించాడు. పూర్తిగా మత్తెక్కే స్థాయిలో తాగేశాడు మల్లారెడ్డి. దొరసానుల్లో ఒకామె వచ్చి మల్లారెడ్డి పక్కన కూర్చుని కూని రాగాలు తీస్తోంది.‘ఎక్క..డుంటాడు న..ర..సింహారెడ్డి? నీకు మంచి బహుమానం ఇస్తా’ అంటూ దొరసానిని మల్లారెడ్డి మీదకు నెట్టాడు కాక్రేన్, నవ్వుతూ. ‘చెప్తా దొరా..! నరసింహారెడ్డి ఇప్పుడు వనదుర్గం దగ్గర ఉన్నాడు’ మల్లారెడ్డి మత్తుగా పలికాడు. మర్నాడే రెండువేలæమంది సైన్యాన్ని వెంటేస్కొని, మల్లారెడ్డితో వనదుర్గం వైపుకు బయలుదేరాడు కాక్రేన్ దొర. ‘దొరా! నేనీడకుమించి రాలేను. ఆ నరసింహారెడ్డి అడుగుజాడ తెలిస్తినే నా గుండె అదురుతాది. చూసినానంటే నేను చచ్చేపోతా’ అంటూ మల్లారెడ్డి గుర్రం దిగి పారిపోయాడు. మా దేవుడు.. మా స్వామి..! జగన్నాథ ఆలయ ప్రాంగణం. నరసింహారెడ్డి అడుగు పెట్టడంతోనే అక్కడి జనమంతా.. ‘అదిగో వచ్చె.. ఇదిగో వచ్చె.. నారసింహారెడ్డిపళపళ పళపళ కేకలేసెరా నారసింహారెడ్డి..’ అంటూ ఆ జగన్నాథుడికి సాటిగా కీర్తిస్తున్నారు. ‘ఎవరు తాతా నారసింహారెడ్డి? ఆయన మనకి దేవుడెట్లా అయినాడు?’ ఓ పిల్లవాడు ఓ తాత పంచచుట్టూ చేరి మెల్లిగా అడిగాడు. ఫ్లాష్‌బ్యాక్.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన జయరామిరెడ్డి మనవడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిన్ననాటి నుంచే కత్తి చేత పడితే భూమి మీద పిడుగులు కనపడేవి. గుర్రపు స్వారీని ఓ ఆటగా మార్చేసుకున్నాడు. తన కోట పరిధిలో ఉన్న మొత్తం 60కి పైగా గ్రామ ప్రజల మంచి – చెడు చూసేవాడు. నరసింహారెడ్డి కళ్ళల్లో ఎంత పొగరుంటుందో, గుండెల్లో అంత తీపి ఉంటుంది. ఈ ధీరత్వం సిద్ధమ్మకు తెగ నచ్చేసింది. ‘నే వలచిన ధీరుడవు నీవే’ అంటూ నరసింహారెడ్డిని ప్రేమలోపడేలా చేసింది. కత్తికి పడనివాడు, సిద్ధమ్మ కంటికి పడ్డాడు. రెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకున్న నరసింహారెడ్డి అక్కడి ప్రజలకు ఓ దేవుడయ్యాడు. అతని దాయాది మల్లారెడ్డికి మాత్రం కంట్లో నలుసయ్యాడు. మొదటి తిరుగుబాటు! 1845వ సంవత్సరం. ఓ మధ్యాహ్నం. తనకు రావాల్సిన తవర్జీని తీసుకురమ్మని నరసింహారెడ్డి తన సైనికుడిని కోవెలకుంట్ల తహశీల్దార్దగ్గరకు పంపాడు.‘మా నరసింహారెడ్డి దొర తవర్జీని నాకిచ్చి పంపమన్నాడు’ తహశీల్దార్ రాఘవచారినిఅడిగాడు సైనికుడు.‘ఏందీ? నీకు దొరా? ఆ దొరనే వచ్చి తీసకపొమ్మను.’ అన్నాడు రాఘవాచారి. బ్రిటీష్ సైనికులు కొందరు నరసింహారెడ్డి సైనికుడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు.‘మా దొరనే అవమానిస్తావా!’ అంటూ అక్కడే ఉన్న చెక్క మొద్దుతో రాఘవాచారిని కొట్టాడు సైనికుడు. మరో పదిమంది బ్రిటీష్ సైనికులను చావబాదాడు. కోపంతో ఊగిపోయిన రాఘవచారి సైనికుడిని కాల్చి చంపమని ఆదేశించాడు. నరసింహారెడ్డి సైనికుడి శవాన్ని, అతడు వచ్చిన గుర్రం మీదనే పంపి ‘నీకింక ఏ తవర్జీ ఇవ్వట్లేదు’ అన్న సందేశాన్ని చేరవేశాడు రాఘవచారి. నరసింహారెడ్డి గుర్రం వేగం మేఘాలతో మాట్లాడుతోంది. నరసింహారెడ్డి జోరు యమదూతలతో మాట్లాడుతోంది. గిట్టల హోరు కట్టలు దాటుతోంది. ఉయ్యాలవాడ... రాఘవచారి గుండె చెరచడానికి సవారి అయ్యాడు. ‘కోబలీ.. రణబలీ..’ అంటూ పొలిమేర చేరాడు. అతని సైగ మేరకు పొలిమేరల్లోనే ఆగిపోయింది సైన్యం. ఒక్కడే రాఘవచారి ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్నాడు నరసింహారెడ్డి. ఉరుములు, మెరుపులతో ఆ ప్రాంతమంతా నరసింహారెడ్డి ఉగ్రరూపాన్ని దర్శించింది. కోట చుట్టూ ఉన్న బ్రిటీష్ సైన్యాన్ని తెగనరుకుతూ రాఘవాచారి దగ్గరకు చేరాడు నరసింహారెడ్డి. ఓ గదిలో దాచుకొని భయపడుతోన్న రాఘవాచారిని బయటకు లాగి, ‘నువ్వు చంపింది నా సైనికుడిని కాదు! వాడు నా రక్తం. ఆ రక్తమింకా ఆరకముందే నువ్వు చావాలి!’ ఒక్క దెబ్బలో రాఘవాచారి తల నరికాడు. వెనకనుంచి వచ్చిన ఓ బ్రిటీష్ సైనికుడి తల కూడా నరికి, ఆ రెండు తలలను చేతబట్టి ఒక్క ఉదుటున గుర్రం ఎక్కేశాడు నరసింహారెడ్డి. పొలిమేరకు చేరగానే ఆయన్ను చూసిన సైనికులంతా విజయ నినాదాలు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన నరసింహారెడ్డి పేరు వాడవాడలా మారుమోగిపోయింది. ప్రకంపనలు మద్రాసులోకూడా వినిపించాయి. వాట్సన్ చాప్టర్..! తెల్లదొరల్లో భయం మొదలైంది. తమ పొగరుని అణిచే వీరుడి పుట్టుకను భరించలేకపోయారు. నరసింహారెడ్డిని చంపే పనిని వాట్సన్‌కి ఇచ్చారు. నరసింహారెడ్డిని అంతమొందించేందుకు బలమైన సైన్యాన్ని వెంటేస్కొని నొస్సం కోటపై దాడికి దిగాడు వాట్సన్. ∙వాట్సన్‌కి బలగముంటే, నరసింహారెడ్డి గుండెల్లో పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్నే సైన్యం గుండెల్లో నింపాడు. ‘తెల్లవాడికి భయపడే గుండె కాదురా ఇది!’ అంటూ విరుచుకుపడ్డాడు. వాట్సన్ బెంబేలెత్తి పారిపోసాగాడు. ‘ఈ నారసింహుడిపైకే దాడికొచ్చావ్! బతకగలననే పారిపోతున్నావా?’ అంటూ వెంటాడి వెంటాడి వాట్సన్ తల నరికాడు నరసింహారెడ్డి. కమ్ముకుంటున్న చీకట్లో నరసింహారెడ్డి పేరు కత్తి అంచులా వెలిగిపోయింది. బ్రిటీష్ ప్రభుత్వ పొగరును నరసింహారెడ్డి అనే రేనాటి పౌరుషం కమ్మేసిన చీకటది. వెన్నుపోటు ప్లాన్..! ‘ఇంతటి మహా వీరుణ్ని ఏ సైన్యమూ ఏమీ చేయలేదు దొరా! వెన్నుపోటే’ ఓ బ్రిటీష్ అధికారి ముందు అన్నాడు మల్లారెడ్డి. ‘వెన్నుపోటు.. వెన్నుపోటు..’ మెల్లిగా తలాడిస్తూ, కోపంగా గొణిగాడు ఆ అధికారి. ‘అయితే ఆ మన్యంలోనే నరసింహారెడ్ది చావు!’ అంటూ పెద్దగా నవ్వాడా అధికారి, మల్లారెడ్డి చెప్పిన పథకం విని. వనదుర్గం అడవులనే ఆవాసంగా మార్చుకున్న నరసింహారెడ్డి అక్కడి వారికి దేవుడిగా అవతరించాడు. ఓ రోజు గిరిజన వాసుల విందు భోజనానికి హాజరయ్యాడు నరసింహారెడ్ది. తాను తింటుండగా భార్య సిద్ధమ్మ వచ్చి ‘నేను ముట్టకముందే మీరెలా తింటున్నారు’ అంటూ ఆ చెయ్యిని లాగేసుకుంది. ‘అమ్మ కంటే ముందు నేను ముట్టాలిది’ అంటూ ఓ సైనికుడు ఆ ముద్ద చేతపట్టాడు. కాసేపట్లో రక్తం కక్కి నేలపడిపోయాడు సైనికుడు. విష ప్రయోగం విఫలం కావడంతో.. ‘కోటలో, అడవిలో అతడి స్థావరం వద్దా నరసింహారెడ్డిని చంపలేం దొరా! నరసింహారెడ్డికి గిరిజనులంటే ప్రేమ. అక్కడి ఆడవాళ్ళంతా ‘అన్నా’ అంటూ కొలుస్తారు. వాళ్ళను చెరిచితే..’ మల్లారెడ్డి తన మాట పూర్తి చేయకముందే, పీటర్‌కు విషయం అర్థమైంది. తెల్లకుక్క చచ్చింది..! ‘ఏమైనాదమ్మా?’ అడిగాడు నరసింహారెడ్డి.‘అడవిలో కట్టెలు కొట్టుకుంటా ఉంటే, బ్రిటీష్ దొరొచ్చి మీద చెయ్యేసి, చెరిచాడన్నా’ ఏడుస్తూ చెప్పిందామె.‘రేపు ఆ తలను ఇదే ఊర్లో తెగ నరికి తెల్లోడి కోటకు పంపించాలా!’ ఆవేశంతో రగిలిపోయాడు నరసింహారెడ్డి.అడవిలో తన స్థావరం నుంచి గిరిజన ఆవాసానికి ఒక్కడే వెళ్ళాడు. పీటర్ ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నాడు. మల్లారెడ్డి కూడా నరసింహారెడ్డి ఎక్కడెక్కడికి వెళుతున్నాడన్నది గమనిస్తున్నాడు. తనని పట్టుకునేందుకొచ్చిన సైనికులందరినీ ఎక్కడికక్కడే నరికిపారేశాడు. పీటర్ మొదటిసారి చూస్తున్నాడు నరసింహారెడ్డిని, భయంతో వణికిపోయాడు. కళ్ళముందే శవాల్లా పడి ఉన్న సైనికులందరినీ విస్తుపోయి చూస్తూన్నాడు. ‘నరసింహారెడ్డి చేతిలో చావు ఇంత భయంకరంగా ఉంటుందా?’ అన్న విçషయం పీటర్‌కు అర్థమవుతోంది. నరసింహారెడ్డి పదగుడుల దూరంలో ఉండగానే, కింద శవంలా పడి ఉన్న తన సైనికుడి కత్తిని తీసుకొని తనని తానే పొడుచుకున్నాడు పీటర్. ‘తెల్లకుక్క చచ్చిందన్నా!’ అందొక గిరిజన యువతి. పీటర్ శవాన్ని ఓ చెట్టుకి వేలాడదీసి, ‘వీడి చావు మన పౌరుషం. తెల్లోడి పొగరుకి మనమిచ్చిన సమాధానం ఈ వేళ్లాడుతున్న శవం’ అరుస్తూ చెప్పాడు నరసింహారెడ్డి.జనమంతా సంబరాలు చేసుకున్నారు.‘అన్నా! ఈ ఏకాదశినాడు జగన్నాథసామికి పూజ చేస్తున్నాం. నువ్వు రావాలన్నా’ నరసింహారెడ్డి చెయ్యి పట్టుకొని అడిగిందో యువతి. నవ్వి, ‘వస్తాలే..!’ అన్నాడు నరసింహారెడ్డి. పరిగెత్తుకుంటూ వెళ్ళిందా యువతి. ఫ్లాష్‌కట్... జగన్నాథ ఆలయ ప్రాంగణం. తన తాత చెబుతోన్న కథంతా వింటూ వచ్చాడు పిల్లవాడు. ఆయుధమేదీ చేతపట్టకుండా, సైన్యం తోడేమీ లేకుండా ఒక్కడే ఆలయానికి వచ్చిన నరసింహారెడ్డి, కొలనులోనుంచి స్నానం చేసి అప్పుడే బయటకు వస్తున్నాడు. పిల్లవాడు తాతను వదిలి పరిగెత్తుకుంటూ వచ్చి, నరసింహారెడ్డి కుడిచెయ్యిని అందుకొని ముద్దుపెట్టాడు. నరసింహారెడ్డి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఓ ముద్దిచ్చాడు.క్షణాల్లో కాక్రేన్ దొర సైన్యమంతా నరసింహారెడ్డిని చుట్టుముట్టింది. కాక్రేన్ దొర వెనకనుంచి వచ్చి పిల్లవాడిని చంపబోయాడు. నరసింహారెడ్డి ఆ కత్తిని లాగి ఇంకో బ్రిటీష్ సైనికుడి గుండెల్లో దించాడు. కాక్రేన్ దొర అదును చూసుకొని పిల్లవాడిని మళ్ళీ పొడవబోయాడు. ఆ కత్తికి అడ్డం పడి పిల్లవాడిని కాపాడాడు. పిల్లవాడిని కాపాడుతూ అప్పటికే నరసింహారెడ్డి ఎన్నో పోట్లకు గురయ్యాడు. మరణానికి దగ్గరైనా కూడా ఏమాత్రం తగ్గనిపొగరుతో కాక్రేన్ దొర మీదకి ఓ సైనికుడి శవాన్ని విసిరేశాడు నరసింహారెడ్డి. కొనఊపిరితో పిల్లవాడిని సైనికులకు దూరంగా తీసుకెళ్ళి, ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్ది పౌరుషం చావదు, చావలేదు. నువ్వే ఓ నరసింహారెడ్డివి’ అంటూండగా కాక్రేన్ దొర నరసింహారెడ్డిని మరలా మరలా పొడిచి, జుల్లేరు వాగుతీరం వద్ద ఉరితీశారు. ఆ తర్వాత అక్కడే నరసింహారెడ్డి తల నరికి, ఆ తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశాడు.తమకు ఎవ్వరూ ఎదురురావొద్దని, జనాల్లో భయం నింపాలన్న ఆలోచనతో అదే కోట గుమ్మానికి 30 ఏళ్ళ పాటు నరసింహారెడ్డి తలను అలాగే వేలాడదీసింది బ్రిటీష్ ప్రభుత్వం.అయితే అది తిరుగుబాటు చేసిన తల. తెల్లోడి పొగరును అణిచిన తల. రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తల. 30 ఏళ్ళు అలా కోట గుమ్మానికి వేలాడుతూ ఉన్న నరసింహారెడ్డి తల. అక్కడి వారిలో తిరుగుబాటును పెంచిందే కానీ వారిని భయపెట్టలేకపోయింది.కాక్రేన్ దొర నరసింహారెడ్డిని చంపిన రోజే ఆయన మీదకు ఓ రాయి విసిరాడు పిల్లవాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషం అప్పుడే మళ్ళీ పుట్టింది. బ్రిటీష్ అధికారి మన్రోను ఎదిరించిన జయరామరెడ్డికి మనవడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అసలు పేరు మజ్జార నరసింహారెడ్డి. కాగా, ఉయ్యాలవాడ అన్న ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. 1805వ సంవత్సరంలో రూపనపూడిలో నరసింహారెడ్డి జన్మించారు. తండ్రి పెద్ద మల్లారెడ్డి.నరసింహారెడ్డి వంశం ఆధీనంలో ఉన్న నొస్సం కోటను వశపరచుకున్న బ్రిటీష్ ప్రభుత్వం, అందుకు తవర్జీ (భరణం) కింద ఆయనకు 1845వ సంవత్సరం వరకూ ఏడాదికి 11 రూపాయలు చెల్లిస్తూ వచ్చింది.నరసింహారెడ్డి చరిత్రను రెండేళ్ళకు పైగా శోధించి, ఆయన కథను రచయిత ఎస్.డి.వి.అజీజ్ ‘పాలెగాడు’ అనే నవలగా తీసుకొచ్చారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను సినిమాగా తెరకెక్కించాలని గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా నరసింహారెడ్డి జీవితకథతో మెగాస్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. పాఠకులకు సూచన: రచయిత ఎస్.డి.వి.అజీజ్ రచించిన పాలెగాడు నవల ఆధారంగా చేసిన సినిమాటిక్ రూపకల్పన ఇది. -
ఉయ్యాలవాడలో ముగ్గురు!?
‘దండాలు దొరా’ అంటూ భారతీయులు మాకు ఊడిగం చేయాలన్న బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అని తెలుసు. అంతకు మించి ఆయన గురించి ప్రేక్షకులకు చెప్పాలని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేయనున్న చిరంజీవి, దర్శకుడు సురేందర్‌రెడ్డి అండ్ టీమ్ చరిత్రను తవ్వుతోంది. వీళ్ల తవ్వకాల్లో ఏం బయటపడిందో తెలుసుకోవాలని సినిమా షూటింగ్ మొదలవ్వక ముందే ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. సినిమా టీమ్ వదిలేద్దురూ... అంటున్నా వినడం లేదు! తాజా తవ్వకాల్లో బయట పడింది ఏంటంటే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముగ్గురు మహిళలు ముఖ్య భూమిక పోషించారట! ఆ ముగ్గురిలో ఓ పాత్రకు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అనుకుంటున్నారట. చిరంజీవితో పలు హిట్ సిన్మాలు చేసిన విజయశాంతిని ఓ పాత్రకు, శ్రుతీహాసన్‌ను మరో పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. -
ఊరూ వాడా ఉయ్యాలవాడ
ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు?... ఇప్పటి యూత్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే గూగుల్ హెల్ప్ తీసుకుంటారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అని పేరు టైప్ చేయగానే స్క్రీన్‌పై కనిపిస్తున్న బొమ్మ ఎవరిదో తెలుసా? చిరంజీవిది! స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఆయన సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో నరసింహారెడ్డి చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో పుట్టారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీషు అరాచక పరిపాలనపై తిరుగుబాటు చేసిన వీరుడు. 1847లో వీరమరణం పొందిన ఈ స్వాతంత్య్ర సమర యోధుడి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రీ–ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇప్పడు ఊరూ వాడా ఈ సినిమా గురించే చర్చ. అక్కడక్కడా ఈ చిత్రం గురించి చక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన వార్తలు తెలుసుకుందాం. తెలుగులో వంద కోట్ల బడ్జెట్ అంటేనే కష్టం. అలాంటిది ‘బాహుబలి–2’ని 250 కోట్లతో తీస్తున్నారని తెలియగానే ‘వర్కవుట్ అవుతుందా?’ అని సందేహించినవాళ్లు ఉన్నారు. కానీ, ఈ సినిమా 1,500 కోట్లు కలెక్ట్ చేసి, టాలీవుడ్ మార్కెట్‌ని పెంచింది. పెద్ద బడ్జెట్ చిత్రాలకు ‘బాహుబలి’ రూట్ వేసింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు 100, 200 కోట్లు. ఆ పైన కూడా ఖర్చు పెట్టి, సినిమాలు తీయడానికి తెలుగు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని కూడా ఖర్చుకు వెనకాడకుండా తీయాలనుకుంటున్నారు. 150 నుంచి 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ∙తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయాలన్నది యూనిట్ ప్లాన్ అట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ అంటే తెలుగువాళ్లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది కాబట్టి, ఇతర భాషలకు కూడా తగ్గట్టు టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని భోగట్టా. మిగతా భాషల్లో పేరు పొందిన నటీనటులను తీసుకుంటే, మార్కెట్ పరిధి పెరుగుతుందనే ఆలోచన కూడా చిత్రబృందానికి ఉంది. ఈ నేపథ్యంలోనే కథానాయికగా ఐశ్వర్యా రాయ్ పేరు సీన్లోకొచ్చింది. ఇందులో ఉన్న అత్యంత కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ని తీసుకోవాలను కుంటున్నారని టాక్. అలాగే తమిళ, కన్నడ.. ఇలా ఇతర సౌత్ లాంగ్వేజెస్ ఆర్టిస్టులు కూడా నటిస్తారట. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ హిందీ మార్కెట్‌కి వెళ్లాలంటే కరణ్ జోహారే సరైనోడని భావించి, రామ్‌చరణ్ ఆయనతో మాట్లాడారనే వార్త షికారు చేస్తోంది. ∙కథా కథనాలు, నటీనటుల కాస్ట్యూమ్స్, నాటి రాయలసీమను తలపించే సెట్స్, లొకేషన్స్.. ఇలా ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ రోజులు పడుతుందట. అలాగే వీఎఫ్ఎక్స్ ఉంటాయి కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కూడా ఎక్కువ రోజులు పడుతుందని సమాచారం. గ్రాఫిక్స్‌కి ఇక్కడివారితో పాటు హాలీవుడ్ నిపుణులు కూడా పని చేస్తారట. ఆగస్ట్‌లో సినిమాని ప్రారంభించి, వచ్చే సమ్మర్‌కి రిలీజ్ చేస్తారట. ∙ఈ చిత్రంలో చిరంజీవి గుబురు గడ్డంతో కనిపిస్తారట. ఆ గడ్డాన్ని రకరకాలుగా ట్రిమ్ చేసి, ఫైనల్లీ ఒకటి ఫిక్స్ చేస్తారట. త్వరలో కాస్ట్యూమ్స్ ట్రైల్స్ కూడా మొదలవుతాయట.