‘షీ’ ఎవరు? | who is she? | Sakshi
Sakshi News home page

‘షీ’ ఎవరు?

Sep 21 2015 11:19 PM | Updated on Jul 25 2018 2:35 PM

ఒక అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘షీ’.

ఒక అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘షీ’. మహేశ్ ఆర్ట్స్ పతాకంపై తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వరరావ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక.  పర్స మహేశ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి హీరోయిన్‌గా నటించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కథ విన్న వెంటనే తేజేశ్వరరావ్‌గారు ఈ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement