దేవుడా.. ఈ హత్యను క్షమించేసెయ్! | When Taapsee Pannu's parents refused to recognize her | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఈ హత్యను క్షమించేసెయ్!

Mar 6 2015 11:07 PM | Updated on Aug 13 2018 3:04 PM

దేవుడా.. ఈ హత్యను క్షమించేసెయ్! - Sakshi

దేవుడా.. ఈ హత్యను క్షమించేసెయ్!

తాప్సీ చాలా డేరింగ్ అండ్ డేషింగ్. మనసులో అనుకున్నవాటిని నిర్మొహమాటంగా...

తాప్సీ చాలా డేరింగ్ అండ్ డేషింగ్. మనసులో అనుకున్నవాటిని నిర్మొహమాటంగా, నిర్భయంగా బయటకు వ్యక్తపరుస్తుంటారు. అందుకు ఉదాహరణ కావాలంటే ఆమె ట్విట్టర్ చూడొచ్చు. అందులో తాను చేసే సినిమాల గురించి మాత్రమే కాకుండా, పలు సామాజిక అంశాల గురించి కూడా పొందుపరుస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్‌లో ఎక్కువ శాతం నిర్భయ ఘటన గురించి ఉన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన దోషుల్లో ముఖేష్ సింగ్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో...

‘అత్యాచారం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటించి ఉండకపోతే బతికి ఉండేదేమో’ అని వ్యాఖ్యానించడం పలువుర్ని ఆగ్రహానికి గురి చేసింది. తాప్సీ అయితే, ‘దేవుడా.. ఈ ఒక్క హత్యను క్షమించేసేయ్.. నాకతన్ని చంపేయాలని ఉంది’ అని ట్విట్టర్లో ఆవేశంగా స్పందించారు. తాను పక్కా స్త్రీవాదిననీ, మహిళల రక్షణార్థం తన వాణిని వినిపించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని తాప్సీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement