తాగేసి సెట్లో చిందులు... | When Sonam Kapoor pretended to be drunk | Sakshi
Sakshi News home page

తాగేసి సెట్లో చిందులు...

Dec 22 2014 11:14 PM | Updated on Sep 2 2017 6:35 PM

తాగేసి సెట్లో చిందులు...

తాగేసి సెట్లో చిందులు...

సోనమ్ కపూర్... పూటుగా తాగేసి సెట్టంతా చిందులు తొక్కారట. అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కూతురయ్యుండి...

సోనమ్ కపూర్... పూటుగా తాగేసి సెట్టంతా చిందులు తొక్కారట. అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కూతురయ్యుండి... ఇంత చౌకబారుగా ప్రవర్తిస్తుందా? అని లొకేషన్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అయితే, ఇక్కడ ట్విస్టు వేరే ఉంది. ఏమిటంటే, ఈ ముద్దుగుమ్మ ‘డాలీ కి డాలీ’ అనే సినిమా చేస్తున్నారు. అభిషేక్ డోగ్రా దర్శకుడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ నిర్మాత. ఈ సినిమాలో కథ రీత్యా సోనమ్ తాగి తూలుతూ పాడే ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ నిమిత్తం నిజమైన విస్కీ బాటిల్‌ని తెప్పించారు దర్శకుడు. పాట షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే... షూటింగ్ పూర్తయ్యాక కూడా సోనమ్ ప్రవర్తనలో మార్పు లేదు.
 
 అది గమనించిన కొందరు... ‘ఇంకా పాత్ర నుంచి బయటకు రాలేదనుకుంట’ అనుకున్నారు. ఇంకేముంది! ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చూసి అర్బాజ్‌ఖాన్ కంగారు పడుతుండగా, అసలు విషయాన్ని అప్పుడు బయటపెట్టారు సోనమ్. కాసేపు అందర్నీ ఫూల్స్ చేయాలనిపించి అలా నటించినట్లు చెప్పింది. ఆమె చెప్పేది నిజమని సెట్‌లో చాలామంది నమ్మలేకపోయారు. అంత గొప్పగా నటించారట సోనమ్. ఎంతైనా గొప్ప నటుడి కూతురు కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement