
ఇలియానా టాలీవుడ్‌లో దేవదాసు చిత్రంతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. మహేష్ పోకిరితో సూపర్ హిట్ కొట్టింది. అంతే తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా చిత్రాలతో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌ను కాదని బాలీవుడ్ బాటపట్టింది ఇలియానా. అక్కడ బర్ఫీ, రుస్తుం లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత కూడా ఇలియానాకి కోరుకున్న స్థాయిలో ఆఫర్లు రాలేదు. దీంతో కెరీర్ గాడి తప్పింది. తిరిగి టాలీవుడ్ వద్దామనుకున్నా అవకాశం ఇచ్చేవాళ్లు లేరు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఈ బ్యూటీ ఆత్మహత్య చేసుకోనే దాకా వెళ్లిందట.
తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేయాలని భావించినట్లు చెబుతోంది ఇలియానా. ఈ నిర్ణయానికి కారణం ఏంటనేది మొదట్లో తనకు తెలియదని.. తరువాత మాత్రం బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ కారణంగా ఆనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన శరీరంపై తనకు ఉన్న ఆలోచనల కారణంగానే ఇలా చేసినట్లు తర్వాత తెలిసిందని చెప్పింది. అయితే ఏమాత్రం ఆలోచించకుండా అవసరమైన చికిత్స తీసుకున్నానని, తను ఎలా ఉందో అలాగే స్వీకరించాలనే విషయాన్ని తెలుసుకుందట. ఆ సమయంలో తన ఆలోచనల్లో ఒక మెచ్యూరిటీ రావటానికి ఆ డిసీజ్ కూడా ఒక కారణం అని రియలైజ్ అయ్యిందట. ఆ విధంగా ఆత్మహత్యయత్నం నుంచి వెనక్కి వచ్చినట్లు తెలిపింది.