రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట! | When Amitabh Bachchan went missing on a railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట!

Jun 26 2014 2:19 PM | Updated on Sep 2 2017 9:26 AM

రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట!

రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట!

అవునండి.. బిగ్ బీ అమితాబ్ ఓసారి కిక్కిరిసిన రైల్వే స్టేషన్ లో తప్పిపోయారట.

అవును.. బిగ్ బీ అమితాబ్ ఓసారి కిక్కిరిసిన రైల్వే స్టేషన్లో తప్పిపోయారట. అప్పుడు ఆయన వయస్సు ఎనిమిదేళ్లు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన బ్లాగ్లో వెల్లడించారు. తాత, అమ్మమ్మలను చూడటానికి తల్లిదండ్రులు ప్రముఖ కవి హరివంశ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ లతో కలిసి అలహాబాద్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు.

రెండు రోజుల ప్రయాణంలో ఒక రైలు నుంచి మరో రైలు మారాల్సి ఉండేది. ప్రయాణీకులు కిక్కిరిసి ఉన్న కారణంగా తాను తప్పిపోయానని, ఆ విషయాన్ని తన తల్లి గ్రహించి.. తండ్రికి చెప్పిందని.. దాంతో వాళ్లిద్దరు ఆందోళన చెంది రైల్వేస్టేషన్ అంతా వెతికారని అమితాబ్ తెలిపారు.

చాలాసేపు వెతికిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఓ పిల్లాడు అక్కడ ఉన్నాడని వాళ్లకు చెప్పడంతో కథ సుఖాంతమైందని అమితాబ్ తన బ్లాగ్లో పోస్ట్ చేశారు. తనకు రైలు ప్రయాణమంటే చాలా ఇష్టమంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రైలును చూసే ఓ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement