లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు! | 'Wazir' mints Rs. 21.01 crore in opening weekend | Sakshi
Sakshi News home page

లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!

Jan 11 2016 7:42 PM | Updated on Sep 3 2017 3:29 PM

లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!

లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసు మీద పడుతున్నా.. కలెక్షన్ల సత్తా తనలో తగ్గలేదని అంటున్నారు. అందుకు నిదర్శనం.. ఆయన తాజాగా నటించిన వజీర్ చిత్రం.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసు మీద పడుతున్నా.. కలెక్షన్ల సత్తా తనలో తగ్గలేదని అంటున్నారు. అందుకు నిదర్శనం.. ఆయన తాజాగా నటించిన వజీర్ చిత్రం. బిజయ్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ డ్రామా కేవలం మొదటి మూడు రోజుల్లోనే రూ. 21 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన వజీర్ సినిమాకు ఆరోజు రూ. 5.61 కోట్ల వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో మాత్రం ఇది దుమ్ము దులిపింది.

ఆ రెండు రోజుల్లో వరుసగా రూ. 7.16 కోట్లు, 8.24 కోట్ల వసూళ్లు వచ్చాయని, దాంతో స్వదేశంలో వీకెండ్ కలెక్షన్లు రూ. 21.01 కోట్లుగా నిలిచాయని సినిమా వర్గాలు తెలిపాయి. ఇది కాక.. ఓవర్సీస్ కలెక్షన్లు మరో రూ. 10.48 కోట్లు వచ్చాయి. ఆ లెక్కన అక్కడ, ఇక్కడ కలిపితే 31.49 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న మాట. విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఫర్హాన్ అఖ్తర్, నీల్ నితిన్ ముఖేష్, అదితి రావు, జాన్ అబ్రహం తదితరులు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement