వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..? | VV Vinayak to direct Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?

Apr 11 2017 11:04 AM | Updated on Sep 5 2017 8:32 AM

వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?

వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?

ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వి వి వినాయక్, నెక్ట్స్ సినిమాను ఓ యంగ్

ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వి వి వినాయక్, నెక్ట్స్ సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ఖైదీ లాంటి భారీ హిట్ తరువాత వినాయక్, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలని భావించాడు. అయితే బాలయ్య ఇప్పటికే వరుసగా సినిమాలకు కమిట్ అయి ఉండటంతో ఇప్పట్లో బాలయ్య, వినాయక్ ల కాంబినేషనేషన్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మీడియం రేంజ్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు వినాయక్.

ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తిక్క, విన్నర్ లు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డ సాయి, ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే సాయి కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement