ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..? | VV Vinayak to direct Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?

Feb 11 2017 11:13 AM | Updated on Sep 5 2017 3:28 AM

ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?

ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?

టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వినాయక్, త్వరలో ఓ మీడియం రేంజ్ సినిమాకు రెడీ

టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వినాయక్, త్వరలో ఓ మీడియం రేంజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తొలి సినిమాతోనే మెగా ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరమ్ తేజ్, ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.

పిల్లానువ్వలేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత కూడా రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా.. వినాయక్ సినిమా ఓకె అయితే మాత్రం అన్ని పక్కన పెట్టేసి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement