ప్రభాస్తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..? | Vivek Oberoi, Jackie Shroff in talks for Prabhas next | Sakshi
Sakshi News home page

ప్రభాస్తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..?

Mar 4 2017 1:14 PM | Updated on Sep 5 2017 5:12 AM

ప్రభాస్తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..?

ప్రభాస్తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..?

దాదాపు నాలుగేళ్లుగా బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్, ఇటీవలే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో భాగం

దాదాపు నాలుగేళ్లుగా బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్, ఇటీవలే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో భాగం చిత్రీకరణ కూడా పూర్తి కావటంతో బాహుబలి గెటప్కు గుడ్ బై చెప్పేసిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రభాస్తో సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించేందుకు ఓకె చెప్పాడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్కు వచ్చిన ఇమేజ్ను కంటిన్యూ చేసే స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది.

అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో హైప్ క్రియేట్ అయ్యే విధంగా కాస్టింగ్ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన నిర్మాతలు ప్రభాస్కు ప్రతినాయకులుగా బాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగంలో విలన్గా నటిస్తున్న వివేక్ ఒబరాయ్తో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్లు ప్రభాస్ సినిమాలోనటిస్తున్నారు.

విలన్లతో పాటు హీరోయిన్ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది యువి క్రియేషన్స్. ఇప్పటికే బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. పేరుకు సౌత్ సినిమానే అయినా.. ప్రభాస్ కొత్త సినిమాను పూర్తి బాలీవుడ్ ప్రాజెక్ట్గా రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. మరి బాహుబలి హవాను ప్రభాస్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement