విజువల్‌ వండర్‌ | Visual Wonder ‘2.0’ To Have A Grand Release Worldwide On November 29 | Sakshi
Sakshi News home page

విజువల్‌ వండర్‌

Nov 19 2018 2:11 AM | Updated on Nov 19 2018 2:11 AM

Visual Wonder ‘2.0’ To Have A Grand Release Worldwide On November 29 - Sakshi

రజనీకాంత్‌

దాదాపు 560 కోట్ల భారీ బడ్జెట్‌.. 3000 మంది వీఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్స్‌.. 250 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కింది ‘2.0’. అంతేనా? పూర్తి స్థాయి 3డీ టెక్నాలజీతో, 4డీ సౌండ్‌ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్‌ సృష్టించింది ‘2.0’. శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘2.0’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ ఈ నెల 29న రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ చిత్రం మేకింగ్‌ వీడియో, ట్రైలర్, సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో ఇండియన్‌ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నిర్మాతల సహకారమే. ఎంతో మంది టెక్నీషియన్స్‌ శ్రమించారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 29న సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులు పొందుతారు’’ అని పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్, కెమెరా: నీరవ్‌ షా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement