మళ్లీ జాతీయ అవార్డు అందుకుంటా! | Sakshi
Sakshi News home page

మళ్లీ జాతీయ అవార్డు అందుకుంటా!

Published Mon, Oct 3 2016 2:34 AM

మళ్లీ జాతీయ అవార్డు అందుకుంటా!

 చిత్రంపై ఎంతో నమ్మకం ఉంటేగానీ విజయంపై గానీ, అవార్డులపైగానీ అచచంలమైన నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని దర్శకుడు సుశీంద్రన్, నటుడ సముద్రకని వ్యక్తం చేస్తున్నారు.వెన్నెల కబడ్డి కుళు, జీవా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకుడు సుశీంద్రన్, నటుడు విష్ణువిశాల్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మా వీరన్ కిట్టు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను నటుడు పార్తిబన్ పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాలలో నిర్వహించారు.చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు, దర్శకుడు సముద్రకని, టీజర్‌ను దర్శకుడు రంజిత్ ఆవిష్కరించారు.
 
  చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ అళగర్‌సామి కుదురై చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నానన్నారు. ఈ మావీరన్‌కిట్టు చిత్రానికిగానూ మరోసారి జాతీయ అవార్డును అందుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు విష్ణువిశాల్ మాట్లాడుతూ తాను దర్శకుడు సుశీంద్రన్‌తో కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇదన్నారు. ఇది కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
  అతిథిగా విచ్చేసిన దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ చిత్ర టీజర్ చూడగానే దర్శకుడు సమాజానికి ఏదో చెప్పబోతున్నారని, కథానాయకుడు సమాజ సమస్య కోసం పోరాడే కథా చిత్రం ఇదని తెలుస్తోందన్నారు.ఇక న టుడు పార్తిబన్ మాట్లాడుతూ ఆయిరత్తిల్ ఒరువన్, అళగి చిత్రాల తరువాత తనకు అంత మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం మా వీరన్ కుట్టి అని పేర్కొన్నారు. కారణం ఇందులో తనది అంత వైవిధ్యభరిత పాత్ర అని తెలిపారు. హౌస్‌ఫుల్ చిత్రం తరువాత ఈ చిత్రం తనకు పలు అవార్డులను అందిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.  
 

 
Advertisement
 
Advertisement