హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్‌ తగ్గించండి: విష్ణు విశాల్‌ | Vishnu Vishal Urges Actors to Cut Salaries | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: హీరోలకే నా సలహా.. పారితోషికాలు కాస్త తగ్గించుకోండి..

Nov 5 2025 7:24 PM | Updated on Nov 5 2025 7:35 PM

Vishnu Vishal Urges Actors to Cut Salaries

చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్‌ మూవీ ఆర్యన్‌ (Aaryan Movie). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్‌ 31న విడుదలైంది. 

హీరోలకే నా సలహా
మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్‌ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 

ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయం
అప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి, సెల్వరాఘవన్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించాడు.

చదవండి: దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్‌ గెలిచింది మాత్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement