చెవి కుట్టించుకున్న మంచు విష్ణు | Vishnu Pierces his ear for Devakatta’s Next | Sakshi
Sakshi News home page

చెవి కుట్టించుకున్న మంచు విష్ణు

Dec 26 2014 2:49 PM | Updated on Sep 2 2017 6:47 PM

చెవి కుట్టించుకున్న మంచు విష్ణు

చెవి కుట్టించుకున్న మంచు విష్ణు

హీరో విష్ణు ప్రతిసారీ ఏదో ఒకటి విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తుంటారు.

హీరో విష్ణు ప్రతిసారీ ఏదో ఒకటి విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా దేవ కట్టాతో విష్ణు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో పాత్ర కోసం తప్పనిసరిగా చెవి కుట్టించుకోవాలని దర్శకుడు దేవ కట్టా విష్ణుకు చెప్పారట. దాంతో వెంటనే సరేనన్న విష్ణు.. బుద్ధిగా తన చెవి కుట్టించుకున్నారు.

ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించాలని ప్రయత్నం చేసే విష్ణు.. ఈసారి కొత్త సినిమాలో మరింత కొత్తగా కనిపించాలని చెవి కుట్టించుకున్నారట. తమిళంలో విజయం సాధించిన అరిమ నంబి అనే చిత్రం ఆధారంగా దేవకట్టా ఈ సినిమా తీస్తున్నారు. తమిళ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా మొదటి షెడ్యూలు పూర్తయింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement