ఆదినా..? అదుర్సా..? | vinayak next movie with ntr | Sakshi
Sakshi News home page

ఆదినా..? అదుర్సా..?

Dec 29 2015 8:48 AM | Updated on Sep 3 2017 2:46 PM

ఆదినా..? అదుర్సా..?

ఆదినా..? అదుర్సా..?

అఖిల్ సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన వినాయక్ తిరిగి సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరు 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిని ఈ మాస్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాల మీద కూడా...

అఖిల్ సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన వినాయక్ తిరిగి సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరు 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిని ఈ మాస్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాల మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా రెండు భారీ ఫ్లాప్స్ తరువాత కూడా స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్నట్టుగా తేల్చేశాడు. అందుకే నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో ఎన్టీఆర్తో త్వరలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు.

అల్లుడు శీను, అఖిల్ సినిమాలతో నిరాశపరిచిన వినాయక్, సినీ ప్రముఖులకు తనమీద ఉన్న నమ్మకాన్ని మాత్రం పొగొట్టుకోలేదు. అందుకే రెండు భారీ ఫ్లాప్ల తరువాత కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు.  నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్తోనే త్వరలోనే సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఆ సినిమా ఆది లేదా అదుర్స్ సినిమాలకు సీక్వల్ అయ్యే చాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement