పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో విక్రమ్‌ | Vikram Saamy Telugu Motion Poster Released | Sakshi
Sakshi News home page

May 24 2018 10:46 AM | Updated on May 24 2018 11:08 AM

Vikram Saamy Telugu Motion Poster Released - Sakshi

‘లక్ష్మీ నరసింహా’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ పవర్‌ పుల్‌ పోలీసాఫీర్‌గా నటించిన ఆ సినిమా తమిళ సినిమాకు రీమేక్‌. విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘సామి’ సినిమాను తెలుగులో బాలకృష్ణ రీమేక్‌ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సామి సీక్వెల్‌ కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే తమిళ్‌ మోషన్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌చేశారు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వామి స్క్వేర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

తాజాగా తెలుగు వెర్షన్‌ మోషన్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. సింగం సిరీస్‌ల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్‌ హరి.. మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథతో రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ్‌లో సామి స్క్వేర్‌ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సామి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 

అటు రాజమండ్రికి 3 కిలోమీటర్లు.... ఇటు న్యూఢిల్లీకి 1984 కిలోమీటర్లు... మధ్యలో విక్రమ్‌. ఎవరి కోసమో కాపు కాస్తున్నట్టు, చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరి విక్రమ్‌ అలా ఎందుకు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement