60 ఏళ్ల వయసులో స్టార్‌ హీరో సర్జరీ.. రిస్క్‌ చేశాడా? | Chiyaan Vikram Stunning Transformation At 60 Sparks Buzz And Surgery Rumors, Read Story For More Details | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల కుర్రాడిలా 60 ఏళ్ల హీరో.. సర్జరీ చేయించుకున్నాడా?

Apr 25 2026 7:24 PM | Updated on Apr 25 2026 9:11 PM

Did Vikram Chiyaan Undergo Surgery For Young Look

సినిమా హీరోలలో కొంతమంది మాత్రమే ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. అలాంటి అతికొద్ది మంది హీరోలలో విక్రమ్ చియాన్‌ ఒకరు. సినిమా సినిమాకు వేరియేషన్‌ చూపిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన గెటప్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అందుకోసం తన శరీరాన్ని దారుణంగా కష్టపెడుతుంటాడు. పాత్ర డిమాండ్‌ చేస్తే.. బరువు పెరగడానికైనా.. తగ్గడానికైనా రేడీ అంటాడు.

విక్రమ్‌ కెరీర్‌ చూస్తే.. శివపుత్రుడు, అపరిచితుడు, కోబ్రా, ఐ, తంగలాన్‌.. ఇవన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. దాని కోసం విక్రమ్‌ ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. కోబ్రా సినిమాలో అయితే ఏకంగా 7 విభిన్నమైన పాత్రల్లో కనిపించి షాకిచ్చాడు. చివరిగా చేసిన తంగలాన్‌, వీరధీర సూర బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచినా.. విక్రమ్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే మూడు సినిమాలతో వస్తానని విక్రమ్‌ ఇప్పటికే ప్రకటించాడు. 

ఇదిలా ఉంటే..తాజాగా విక్రమ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న విక్రమ్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో విక్రమ్‌ చాలా యంగ్‌గా, ఒత్తైన జుట్టుతో కనిపించాడు. విక్రమ్‌ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఈ వయసులోనూ విక్రమ్‌ అంత యంగ్‌గా కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

ఇలా యవ్వనంగా కనిపించేందుకు విక్రమ్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  ‍విదేశాల్లో ఆయన అత్యాధునిక కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌లు చేయించుకోవడం వల్లే ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాడని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ప్రకృతి వైద్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.  విక్రమ్ సర్జరీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ పుకారు చక్కర్లు కొడుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement