కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తంగలాన్ తర్వాత మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో 63వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు.
What starts as a FLAME ends in a BLAZE 🔥 #Chiyaan63 FIRST FLAME out now ▶️ https://t.co/2FnD5Wetin
Wishing the one and only #ChiyaanVikram a very happy birthday!#CookingStartsNow #Chiyaan63FirstFlame@SathyaJyothi @chiyaan @anandshank @Music_Santhosh @RDRajasekar @arjun1on… pic.twitter.com/w6UTCR34tP— Sathya Jyothi Films (@SathyaJyothi) April 17, 2026


