ఆ హీరోకు జోడి కుదిరింది..  | Vikram Prabhu Acts with Mahima Nambiar | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ప్రభుకు జోడి కుదిరింది..

Apr 10 2018 5:57 PM | Updated on Apr 10 2018 5:57 PM

Vikram Prabhu Acts with Mahima Nambiar - Sakshi

విక్రమ్‌ ప్రభు

ఎట్టకేలకు యవ నటుడు విక్రమ్‌ ప్రభుకు హీరోయిన్‌  దొరికింది. యువ హీరో విక్రమ్‌ప్రభు, మహిమ నంబీయార్‌ల జోడీ కుదిరింది. మొదటి చిత్రం కుంకీతోనే పల్లెటూరి కుర్రాడి పాత్రలో విక్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రస్తుతం అసుర గురు అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఏ.రాజ్‌దీప్‌ డైరెక్టర్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం బాగానే అన్వేషణ జరిగిందట. చివరకు నటి మహిమ నంబీయార్‌ సెట్‌ అయ్యింది.

ఈ బ్యూటీ చాలా తక్కువ చిత్రాలోనే నటించింది. కానీ అందులో విజయం సాధించినవి ఎక్కువ. ఈ చిత్రాన్ని జే. సతీశ్‌కుమార్‌ నిర్మించనున్నారు. దీనికి గణేశ్‌ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement