విక్రమ్ రాజవేషం | Vikram, Amy Jackson sizzle in Shankar's Ai | Sakshi
Sakshi News home page

విక్రమ్ రాజవేషం

Mar 31 2014 11:33 PM | Updated on Sep 2 2017 5:24 AM

విక్రమ్ రాజవేషం

విక్రమ్ రాజవేషం

సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న... నటుడిగా విక్రమ్ ఏంటో చెప్పడానికి ఈ సినిమాలు చాలు. స్టార్‌గా కంటే నటుడిగా విక్రమ్‌ని అందరూ ఇష్టపడతారు.

 సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న... నటుడిగా విక్రమ్ ఏంటో చెప్పడానికి ఈ సినిమాలు చాలు. స్టార్‌గా కంటే నటుడిగా విక్రమ్‌ని అందరూ ఇష్టపడతారు. కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలను ఇష్టపడే నటుల్లో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఐ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ‘మనోహరుడు’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. శంకర్ సినిమాలో నటించాక, దాని తర్వాత సినిమాకు తేలిగ్గా పచ్చజెండా ఊపలేరు హీరోలు. 
 
 ఎందుకంటే... తన సినిమాతో వాళ్ల ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెడతారు శంకర్. కాబట్టి... ‘ఐ’ తర్వాత విక్రమ్ పరిస్థితి ఏంటి? ఇది కోలీవుడ్ మొత్తాన్నీ వెంటాడుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు తేలిగ్గా సమాధానం చెప్పారు విక్రమ్. ‘ఐ’ నిర్మాణంలో ఉండగానే భూపతి పాండ్యన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విక్రమ్. ఆ సినిమా పేరు ‘రాజవేషం’. ఆద్యంతం హాస్యభరితంగా సాగే ఈ సినిమాలో వాణిజ్య అంశాలు కూడా మెండుగా ఉంటాయట. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement