లేడీ డైరెక్టర్‌ సినిమాకి యస్‌ | Vijay, Vivek does it for Surya | Sakshi
Sakshi News home page

లేడీ డైరెక్టర్‌ సినిమాకి యస్‌

Jul 29 2018 12:56 AM | Updated on Jul 29 2018 12:56 AM

Vijay, Vivek does it for Surya - Sakshi

సూర్య

హీరో సూర్య టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ కెరీర్‌ను మస్త్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్, కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేస్తోన్న సూర్య తర్వాతి చిత్రం ‘ఇరుది సుట్రు’ ఫేమ్‌ సుధా కొంగర డైరెక్షన్‌లో రూపొందనుందని కోలీవుడ్‌ సమాచారం. తొలిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో సూర్య చేయనున్న చిత్రం ఇది.

‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్‌ ‘గురు’ చిత్రం కూడా సుధా కొంగర దర్శకత్వంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘మెర్సెల్, వేలైక్కారన్, సర్కార్‌’ చిత్రాలకు పాటలు రాసిన వివేక్‌ ఈ సినిమాకు కూడా లిరిక్స్‌ రాయనున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించనున్నారు. ‘‘సూర్య సార్‌తో తొలిసారి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్‌ మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. సుధా మేడమ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు వివేక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement