రెహమాన్‌తో తొలిసారి | Vijay turns singer for AR Rahman | Sakshi
Sakshi News home page

రెహమాన్‌తో తొలిసారి

Jul 9 2019 5:53 AM | Updated on Jul 9 2019 5:53 AM

Vijay turns singer for AR Rahman - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ వీలున్నప్పుడల్లా తన సినిమాలో పాటలు పాడుతుంటారు. గతంలో ‘రసిగన్, వేలై, తుపాకీ, కత్తి, తేరి, భైరవ’ వంటి సినిమాల్లో 20కి పైగా గీతాలను ఆలపించారు విజయ్‌. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ‘బిగిల్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. బిగిల్‌ అంటే విజిల్‌ అని అర్థం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘వెరితనం..’ అనే పాటను విజయ్‌ పాడారట. వెరితనం అంటే కసి, ఉన్మాదం వంటి అర్థాలున్నాయి. ఇదిలా ఉంటే.. రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో విజయ్‌ పాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. దీపావళికి రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక.

Advertisement
 
Advertisement
Advertisement