ఆ సినిమాకు విజయ్ దూరం | Vijay turns down Sundar C's 'Sanghamitra' | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు విజయ్ దూరం

Aug 1 2016 2:53 PM | Updated on Sep 4 2017 7:22 AM

ఆ సినిమాకు విజయ్ దూరం

ఆ సినిమాకు విజయ్ దూరం

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాలో తాను నటించబోనని తమిళ సూపర్ స్టార్ విజయ్ తేల్చిచెప్పేశాడు.

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాలో తాను  నటించబోనని తమిళ సూపర్ స్టార్ విజయ్ తేల్చిచెప్పేశాడు. బాహుబలి కంటే పెద్ద బడ్జెట్ తో 11 దేశాలలో షూటింగ్ ఉంటుందని చెబుతున్న ఇంతటి భారీ ప్రాజెక్టును విజయ్ తిరస్కరించాడు. 'ఈ సినిమాలో నటించాల్సిందిగా విజయ్ ని దర్శకుడు సుందర్ అడిగిన విషయం నిజమే. కానీ ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ఏడాదికిపైగా పడుతుందని విజయ్ భావించాడు. విజయ్ తన కెరీర్ను దృష్టిలో ఉంచుకుని ఓ ప్రాజెక్టు కోసం ఇంత సుదీర్ఘ సమయం కేటాయించడానికి సుముఖత చూపలేదు' అని విజయ్ సన్నిహితులు చెప్పారు.

సుందర్ దర్శకత్వంలో థెనాండల్ ఫిల్మ్స్ ఈ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రధాన పాత్రలకు నటులను ఎంపిక చేయలేదు. దర్శకుడు సుందర్ టెక్నికల్ సిబ్బందిని ఎంపిక చేసుకున్నాడు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్, కెమెరామెన్గా సుదీప్ ఛటర్జీ, ఆర్ట్ డైరెక్టర్గా సబు సిరిల్లను ఎంపిక చేశాడు. విజువల్ ఎఫెక్స్ బాధ్యతలు ఆర్ సీ కమలాకన్నన్కు అప్పగించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement