విలన్‌ కాదు సోదరుడు..! | Vijay Sethupathi plays the villain in Rajini next | Sakshi
Sakshi News home page

Mar 6 2018 10:24 AM | Updated on Mar 6 2018 10:24 AM

Vijay Sethupathi plays the villain in Rajini next - Sakshi

తమిళ హీరో విజయ్‌ సేతుపతి

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నూతన చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా యువ నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది నిజమా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. చిన్న సహాయ నటుడి స్థాయి నుంచి సక్సెస్‌ఫుల్‌ హీరో స్థాయికి ఎదిగిన నటుడు విజయ్‌సేతుపతి. ప్రస్తుతం కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. చేతి నిండా చిత్రాలున్నాయి. పైగా నిర్మాతగా కూడా మారి జుంగా అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు.  తెలుగులో చిరంజీవితో కలిసి భారీ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తునారు. ఇలాంటి తరుణంలో రజనీకాంత్‌ తాజా చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా మారనున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. 

రజనీకాంత్‌ 2.ఓ, కాలా చిత్రాల తరువాత యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. ఇందులో రజనీకాంత్‌ సరసన నటించే హీరోయిన్‌ ఎవరన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా, విలన్‌గా మాత్రం విజయ్‌సేతుపతి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో విజయ్‌ విలన్‌గా కాదు రజనీకి తమ్ముడిగా నటించనున్నారట.నిజానికి ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement