ఖైదీ డైరెక్టర్‌తో విజయ్‌

Vijay Next Movie With Director Lokesh Kanagaraj - Sakshi

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్న కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌. ప్రతీ సినిమాకు తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ పోతున్న విజయ్‌, సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విజయ్‌ తదుపరి చిత్రాన్ని ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

మానగరం, అవియల్‌ లాంటి సినిమాలను తెరకెక్కించిన లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు విజయ్‌ ఓకె చెప్పాడట. లోకేష్ ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top