మాల్యాపై బయోపిక్‌ టైటిల్‌ ఏంటంటే..

Vijay Mallyas Biopic All Set To Release, Govinda Plays The Lead Role - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బయోపిక్‌ల హవా నడుస్తున్న క్రమంలో పలువురి జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్‌ పహ్లాజ్‌ నిహ్లానీ వెల్లడించారు. విజయ్‌ మాల్యా పాత్రను ప్రముఖ నటుడు గోవింద పోషిస్తారని చెప్పారు. మాల్యా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తానని, మాల్యాగా గోవింద అలరిస్తాడని చెప్పుకొచ్చారు. సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని, దీన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తానని నిహ్లాని తెలిపారు.

ఈ సినిమా టైటిల్‌ రంగీలా రాజా అని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 35 ఏళ్ల తర్వాత నిహ్లాని దర్శకత్వంలో గోవింద నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించారని తెలిసింది. విజయ్‌ మాల్యా బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడై బ్రిటన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. మాల్యా అప్పగింతపై ప్రస్తుతం బ్రిటన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top