‘జాగ్వార్‌’తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ డైరెక్టర్‌! | Vijay Kumar Konda Direct To Nikhil Gowda Movie | Sakshi
Sakshi News home page

Nov 24 2018 3:56 PM | Updated on Nov 24 2018 3:57 PM

Vijay Kumar Konda Direct To Nikhil Gowda Movie - Sakshi

కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ జాగ్వార్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది బెడిసికొట్టడంతో నిఖిల్‌ వచ్చిన సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కన్నడలో మాత్రం నిఖిల్‌ బిజీగానే ఉన్నాడు. అయితే ఈ కన్నడ హీరోను మన టాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేయబోతున్నాడు. 

‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీతో హిట్‌ కొట్టిన విజయ్‌కుమార్‌ కొండ.. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగచైతన్య, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించినా.. మళ్లీ ఇంతవరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. శ్యాండిల్‌వుడ్‌లో తన ప్రతిభను చాటుకుని.. టాలీవుడ్‌ మళ్లీ అవకాశాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాడేమో దర్శకుడు విజయ్‌. దీనిలో భాగంగానే నిఖిల్‌ గౌడతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం నిఖిల్‌ సీతారామ కళ్యాణ, కురుక్షేత్ర సినిమాలో అభిమన్యుడిగా నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement