విలువైన బహుమతి ఇచ్చాడు! | Vijay gave me 'best' gift: Amala Paul | Sakshi
Sakshi News home page

విలువైన బహుమతి ఇచ్చాడు!

Oct 27 2014 11:43 PM | Updated on Sep 2 2017 3:28 PM

విలువైన బహుమతి ఇచ్చాడు!

విలువైన బహుమతి ఇచ్చాడు!

ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. విజయ్ నాకో విలువైన బహుమతి ఇచ్చాడు’’ అని అమలాపాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్‌తో కలిసి మకావ్‌లో ఉన్నారు.

 ‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. విజయ్ నాకో విలువైన బహుమతి ఇచ్చాడు’’ అని అమలాపాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్‌తో కలిసి మకావ్‌లో ఉన్నారు. ఆదివారం తన పుట్టినరోజుని అక్కడే జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమలా పాల్ మాట్లాడుతూ -‘‘కాలం గడిచిపోతున్న విషయమే నాకు తెలియడంలేదు. అంత హాయిగా ఉంది.
 
 ఇప్పుడు నా వయసులో ఓ సంవత్సరం పెరిగింది. ఈ సందర్భంగా విజయ్ నాకో మంచి బహుమతి ఇచ్చాడు. ప్రతి స్త్ర్రీ దాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఈ ఆనందంలో నాకు నోట మాట రావడంలేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి’ అన్నారు. స్త్రీకి విలువైనది అంటే.. ‘మాతృత్వం’. అందుకని అమలాపాల్ దీన్ని ఉద్దేశించే అని ఉంటారని అందరూ ఊహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement