కోటి 70 లక్షల సహాయం: విజయ్‌ దేవర‌కొండ ఫౌండేషన్‌ | Sakshi
Sakshi News home page

కోటి 70 లక్షల సహాయం: విజయ్‌ దేవర‌కొండ ఫౌండేషన్‌

Published Fri, Jun 5 2020 4:19 PM

Vijay Deverakonda Foundation Helps 17000 Households - Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యూత్‌ సెన్సెషనల్‌‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కష్ట కాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి తన చారిటీ ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, మందులు అందిస్తు తన వంతు సహాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా రూ. కోటితో ‘ది దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్‌)’‌, రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్(ఎంసీఎఫ్‌)‌’ అనే రెండు చారిటీ సంస్థలను ప్రారంభించాడు. అయితే గత 36 రోజులుగా తమ ఫౌండేషన్‌ ద్వారా కోటి 70లక్షల ఆర్థిక సహాయంతో 17,000 మంది పేద ప్రజలకు సహాయం చేసినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

కాగా జూన్‌ 2 నుంచి లాక్‌డౌన్‌ సడలింపు వల్ల వ్యాపారాలు, కార్యకలాపాలు ప్రారంభమయినందున తమ సేవా కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. అలాగే కేవలం పేద ప్రజలకు సహాయం చేయడమే కాకుండా.. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనే ద్వేయంగా  విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌ పని చేస్తుందని ఫౌండేషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో తమ ఫౌండేషన్‌ ద్వారా 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే.. ఇద్దరు విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని, మిగతా 48 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు. విజయ్‌ దేవరకొండ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు. చదవండి: కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్‌

Advertisement
Advertisement