తమిళ బిగ్‌బాస్‌లో తెలుగు హీరో | Vijay Devarakonda Visit Tamil Bigg Boss | Sakshi
Sakshi News home page

తమిళ బిగ్‌బాస్‌లో విజయ్‌ దేవరకొండ

Sep 29 2018 7:10 PM | Updated on Sep 29 2018 7:11 PM

Vijay Devarakonda Visit Tamil Bigg Boss - Sakshi

ఇప్ప‌టికే తెలుగు బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌..

ఇప్ప‌టికే తెలుగు బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్‌ కోసం విజయ్‌ తమిళ బిగ్‌బాస్‌ షోకు వెళ్లాడు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ అక్క‌డి బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్క‌డ స్టేజ్ పై త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకునే అవ‌కాశం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే ద‌క్కింది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న ‘నోటా’  సినిమాను త‌మిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ సెన్సెషన్‌ స్టార్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా ఒకేసారి విడుద‌ల కానుంది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement