బిచ్చగాడుని మించుతుంది | Vijay Antony's Kasi to release on May 18 | Sakshi
Sakshi News home page

బిచ్చగాడుని మించుతుంది

May 16 2018 1:01 AM | Updated on May 16 2018 1:01 AM

Vijay Antony's  Kasi to release on May 18 - Sakshi

‘‘తెలుగు నిర్మాతలందరూ నన్ను వారి హీరోగా భావించి ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలనే ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను. త్వరలోనే తెలుగులో స్ట్రయిట్‌ మూవీ చేయాలనుకుంటున్నా’’ అని విజయ్‌ ఆంటోనీ అన్నారు. విజయ్‌ ఆంటోనీ, అంజలి, సునైన హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కాశి’. కృతిక ఉదయనిధి దర్శకురాలు. ఉదయ్‌ హర్ష వడ్డెల, గణేష్‌ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ సినిమాని ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రాలతో పోల్చితే ‘కాశి’ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నా ‘బిచ్చగాడు’ని మించి హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

నా ఏ సినిమా పాటలైనా ‘విజయ్‌ ఆంటోని.కామ్‌’ నుంచి ఎప్పుడైనా ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘విజయ్‌గారు ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశారు. ‘కాశి’తో మరో హిట్‌ సాధిస్తారని భావిస్తున్నా’’ అన్నారు నిర్మాత కిరణ్‌. ‘‘సినిమా చూశా. చక్కగా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్‌ తెలుగులో ఓ స్ట్రయిట్‌ సినిమా  చేస్తారు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ‘‘కాశి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను. విజయ్‌గారు కథ వినగానే నన్ను నమ్మి డైరెక్షన్‌ అవకాశం ఇచ్చారు’’ అన్నారు కృతిక ఉదయనిధి. నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్, సునైన, నటుడు మధు, రచయిత భాషా శ్రీ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, అమృత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement