విజయ్‌ఆంటోనికి జతగా సునైనా | Vijay Antony new movie kalee in 3 heroins | Sakshi
Sakshi News home page

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

Jul 24 2017 2:54 AM | Updated on Sep 5 2017 4:43 PM

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

నటి సునైనాకో అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఎందుకనో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోలేకపోతోంది.

తమిళసినిమా: నటి సునైనాకో అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఎందుకనో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోలేకపోతోంది. నీర్‌పార్వై వంటి కొన్ని చిత్రాల్లో సునైనా నటన విమర్శకులను సైతం మెప్పిం చింది. ఈ మధ్య తొండన్‌ చిత్రంతోనూ విజయాన్ని అందుకున్న సునైనా తాజాగా విజయ్‌ఆంటోనితో జతకట్టడానికి రెడీ అవుతోంది.యమన్‌ చిత్రం తరువాత విజయ్‌ఆంటోని అన్నాదురై అనే ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రంలో నటిస్తున్నారు.

శ్రీనివాసన్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కాళీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట.అందులో ఒకరుగా సునైనా ఎంపికయ్యారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.కాళీ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సునైనా తెలిపారు. త్వరలోనే కాళీ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందట. దీని  విజయ్‌ఆంటోని సొంత నిర్మాణ సంస్థ« విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ నిర్మించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement