రిలీజ్‌కు ముందే చూస్తారా! | Vijay Antony’s interesting idea to encourage legal downloads! | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు ముందే చూస్తారా!

Nov 16 2017 1:15 AM | Updated on Nov 16 2017 1:15 AM

Vijay Antony’s interesting idea to encourage legal downloads! - Sakshi

సినిమా విడుదలకు పదిహేను రోజుల ముందు అందులో మొదటి పది నిమిషాల వీడియోను ప్రేక్షకులకు చూపించడమంటే సాహసమే. ఈ సాహసానికి ‘సై’ అంటున్నారు విజయ్‌ ఆంటోని. ఆయన హీరోగా నటించిన తాజా సిన్మా ‘ఇంద్రసేన’ పాటల్ని ఈరోజు హైదరాబాద్‌లో రిలీజ్‌ చేయనున్నారు. ఈ వేడుకలో సిన్మాలోని పది నిమిషాల నిడివి గల వీడియోను, ఓ ఫుల్‌ వీడియో సాంగును ప్రదర్శించనున్నారు. జి. శ్రీనివాసన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ హక్కులను ఎన్‌.కె.ఆర్‌. ఫిల్మ్స్‌ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘ఇంద్రసేన’ టీజర్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు తగ్గట్టు ఉంటుందీ సిన్మా. కంటెంట్‌పై నమ్మకంతో పది నిమిషాల వీడియోను విడుదల చేస్తున్నాం. అలాగే, ఫుల్‌ వీడియో సాంగును రవితేజ విడుదల చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన గత సినిమాలు ‘ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా’ తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోని స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement