విజయ్‌ సినిమా కథ లీకైందా!

Vijay And Atlee Movie Storyline Leaked - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్‌ నెక్ట్స్ సినిమా మీద భారీ  అంచనాలు ఉన్నాయి. అయితే విజయ్‌ ఫుట్ బాల్‌ నటిస్తున్న ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయ్‌ కోచింగ్ ఇస్తున్న టీంలోని ప్రధాన సభ్యులు ఒక్కొక్కరుగా హత్యకు గురి కావటం. ఆ హత్యలకు విజయ్‌ కారణమని పోలీసులు అరెస్ట్ చేయటం. ఆ కేసు నుంచి విజయ్‌ ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ అన్న టాక్‌ వినిపిస్తోంది.

థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ క్యారెక్టర్‌, పర్పామెన్స్‌ హైలెట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో విజయ్‌, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన తేరి, మెర్సల్‌ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఏర్పడ్డాయి. విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top