సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

Vidyut Jammwal Workouts With Full Cylinder - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో, కండల వీరుడు విద్యుత్‌ జమాల్‌ ఫుల్‌ సిలిండర్‌తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్‌ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్‌ సిలిండర్‌తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. విద్యుత్‌ జమాల్‌ నటుడిగా మాత్రమే కాక, మార్షల్‌ ఆర్టిస్ట్‌గా, స్టంట్స్‌మాన్‌గా బాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక‌్షన్‌ సీన్స్‌కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్‌ అవార్డులు వరించాయి. అయితే జమాల్‌ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్‌ సిలిండర్‌తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్‌ చేశారు.
Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU

వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్‌లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్‌ బుక్‌ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్‌’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్‌ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్‌ విసురుతున్నారు.

Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top