Vidyut Jammwal : పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్‌మెంట్‌ రద్దు

Vidyut Jammwal Nandita Mahtani Call Off Engagement Actor Shares Cryptic Post - Sakshi

ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్‌ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్‌ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్‌ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్‌ బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్‌, ఖుదా హాఫీజ్‌, జంగ్‌లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్‌ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు.

2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చారు. రీసెంట్‌గా అనన్య కజిన్‌ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్‌-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్‌  చేశారు. బీటౌన్‌ క్యూట్‌ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top