breaking news
Engagement Breakup
-
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. -
రష్మికతో ఎంగేజ్మెంట్ బ్రేక్ : రక్షిత్ స్టేట్మెంట్
తొలి సినిమా ‘ఛలో’, రెండో సినిమా‘గీత గోవిందం’తో తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న.. టాలీవుడ్లోకి రాకముందు ఆమెకు కన్నడలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. టాలీవుడ్లోకి ప్రవేశించి, ఈ ఫాలోయింగ్‌ను, తన పాపులారిటీని మరింత పెంచేసుకుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. కన్నడలో తనకు విశేషమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ‘కిరిక్ పార్టీ’ చిత్రీకరణ సమయంలోనే నిర్మాత, సహ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. పెద్దల అంగీకారంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రద్దయింది. కారణాలు ఏమన్నది తెలియదు కానీ, ఈ ఇరువురు విడిపోయారు. వీరి ఎంగేజ్మెంట్ రద్దు కావడానికి కంటే ముందే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. ఆ వార్తలను రక్షిత్ శెట్టి ఖండించాడు. అయితే నిన్న కన్నడ పాపులర్ న్యూస్ పేపర్ అధికారికంగా రష్మిక, రక్షిత్‌ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందని ప్రకటించడంతో, సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. రష్మిక, రక్షిత్‌ల ఎంగేజ్మెంట్ రద్దు కావడంపై ఆమె తల్లి కూడా తామిప్పుడు బాధలో ఉన్నట్టు చెప్పారు. రష్మికపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని తట్టుకోలేని రక్షిత్ శెట్టి, ఆమెను తప్పుపట్టందంటూ కోరుతూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్టు పెట్టారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మికా గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి. దయచేసి ఆమెను శాంతిగా ఉండనీయండి. త్వరలోనే ప్రతీది ఓ ముగింపుకు వస్తుందని నేను ఆశిస్తున్నా. నిజమేమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. మీడియా న్యూస్‌గా వెళ్లకండి. ఎవరూ కూడా నానుంచి, రష్మికా నుంచి సమాచారం పొందిలేరు. వారి అవసరానికి తగ్గట్టు వారు సొంత వార్తలు రాసుకున్నారు. అంచనాలు, ఊహాగానాలు నిజం కావు. కొన్ని రోజులు మాత్రమే ఈ పేజీ లైవ్‌లో ఉంటుంది. నేను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నా. ఒకవేళ నిజంగా అవసరం అనిపించినప్పుడు మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తా. నేను కేవలం ఇప్పుడు పనిపైనే దృష్టిసారించనున్నా’ అని పేర్కొంటూ ఓ పెద్ద లెటరు రాసుకొచ్చారు. దీంతో నిన్నమొన్నటివరకూ వీరిద్దరి బ్రేకప్‌పై ఉన్న కన్ఫ్యూజన్ పోయి ఇద్దరూ విడిపోయారనే విషయంలో క్లారిటీ మాత్రం వచ్చింది. రష్మికను తప్పు పట్టదంటూ రక్షిత్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు!
ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శాండల్‌వుడ్ తార పూజాగాంధీకి ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికేశాడు. ఎంగేజ్మెంట్ బ్రేకప్‌తో కొంత కాలంగా డిస్టర్బ్డ్ మూడ్‌లో ఉన్న ఈ చిన్నది... ఇండస్ట్రీ పీపుల్‌తో వెక్స్ అయినట్టుంది. ఇప్పటి వరకూ దర్శక నిర్మాతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అమ్మడు తాజాగా ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ కుర్రోడితో లింకు పెట్టుకుందని అక్కడ టాక్. పూజా ఎక్కడుంటే అక్కడే కనిపిస్తున్నాడట అతగాడు. ఖాళీ సమయాల్లోనూ ఒకరినొకరు వదలకుండా... లంచ్‌లు, డిన్నర్లకు చెక్కేస్తున్నారట.