లండన్‌లో ల్యాండ్‌ అయ్యానోచ్‌! | Sakshi
Sakshi News home page

లండన్‌లో ల్యాండ్‌ అయ్యానోచ్‌!

Published Sun, Jun 24 2018 12:35 AM

vidyullekha raman  in london for movie shooting - Sakshi

సిల్వర్‌ స్క్రీన్‌పై విద్యుల్లేఖా రామన్‌ ఉంటే చాలు. కామెడీకి కొదవ ఉండదు ఆడియన్స్‌కు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె చేసిన రోల్‌ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మళ్లీ వెంకీ అట్లూరి సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అఖిల్‌ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ యూకేలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షూట్‌లో జాయిన్‌ అవ్వడానికి లండన్‌లో ల్యాండ్‌ అయ్యారు విద్యుల్లేఖా రామన్‌. ‘‘అఖిల్‌ థర్డ్‌ మూవీలో ఎగై్జటింగ్‌ క్యారెక్టర్‌ చేయడానికి లండన్‌ వచ్చాను. లెట్స్‌ రాక్‌ అఖిల్‌’’ అని పేర్కొన్నారామె. ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌ చేయనున్నారట.  చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement