తగ్గాల్సింది నేను కాదు... మారాల్సింది మీరే! | Vidya Balan's Reply To A Journalist Fat Shaming Her Is The Attitude | Sakshi
Sakshi News home page

తగ్గాల్సింది నేను కాదు... మారాల్సింది మీరే!

Nov 17 2017 5:13 AM | Updated on Nov 17 2017 5:13 AM

Vidya Balan's Reply To A Journalist Fat Shaming Her Is The Attitude - Sakshi

కొంచెం బొద్దుగా ఉండే కథానాయికలను ‘ఎప్పుడు సన్నబడతారు?’ అనడుగుతారు. ‘జీరో సైజ్‌’ హీరోయిన్లను ‘కొంచెం బరువు పెరిగితే బాగుంటుంది’ అంటారు. ఎలా ఉన్నా ఏదొకటి అంటారు. కొందరు హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్‌ని లైట్‌ తీసుకుంటారు. నిన్న మొన్నటివరకూ విద్యాబాలన్‌ అలానే తీసుకున్నారు. కానీ, ఇక ఇలాంటి ప్రశ్నలడిగితే క్షమించేది లేదన్నట్లు ఘాటుగా స్పందించారు. సురేశ్‌ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన ‘తుమ్హారీ సులు’ నేడు విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న విద్యాబాలన్‌ని.. ‘ప్రస్తుతం మీరు లావుగా ఉన్నారు.

ఎప్పుడు సన్నబడి గ్లామర్‌ రోల్స్‌ చేస్తారు?’ అని ఓ విలేకరి అడిగారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? గ్లామర్‌గా కనిపించాలంటే సన్నబడాలా? సన్నగా ఉంటేనే అవకాశాలొస్తాయా? అయినా, నేను ప్రస్తుతం బరువు తగ్గాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్న పాత్రలకు నాజూకుగా ఉండాలని రూలేం లేదు. ఈ విషయంలో ముందు మీ మైండ్‌ సెట్‌ మారాలి. తగ్గాల్సింది నేను కాదు’’ అని ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడేం అడిగామని.. సన్నబడతారా? అన్నాం.. అంతేగా? అని సదరు విలేకరి సన్నిహితులతో వాపోయారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement