‘టుక్‌టాక్‌’ చేసిన విద్యాబాలన్‌

Vidya Balan hilarious Tak Tuk video - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ టుక్‌టాక్‌ చేసింది. టిక్‌టాక్‌ అనుకుంటే పొరపాటు... తను నిజంగా టుక్‌టాకే చేసింది. సరదాగా టుక్‌టాక్‌ అనే ట్యాగ్‌తో తాను చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో బెంగుళూరు బ్యూటీ విద్యాబాలన్‌ ఎరుపు రంగు చీరలో కనిపిస్తారు. ఈ వీడియోలో విద్యాబాలన్‌ పండితుని వాయిస్‌ను అనుకరిస్తూ .. ‘శాస్త్రాల ప్రకారం ప్రతీ అమ్మాయిలో దేవీ రూపాలు ఉంటాయి. కాకపోతే పెళ్లి అయ్యాక ఏ అమ్మవారు వారిలో నుంచి బయటకు వస్తారనేది మాత్రం భర్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది’ అని చెబుతుంది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు.

కాగా విద్యాబాలన్‌ తాజా సినిమా మిషన్‌ మంగళ ఆగస్టు 15న విడుదల కానుంది. మార్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) శాస్త్రవేత్తల గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఒకపైపు ఆలోచింపజేస్తూనే మరోవైపు వినోదాన్ని అందిస్తుందని ఈ మూవీ హీరో అక్షయ్‌ కుమార్‌ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top