వెంకీ... ఖుష్బూ@ 32

Victory Venkatesh and kushboo completes 32 years in the industry - Sakshi

వెంకటేశ్‌ ఐదు పదుల వయసు దాటేసిన విషయం తెలిసిందే. కానీ తన వయసు ఇంకా 32 ఏళ్లే అంటున్నారాయన. వెంకీ అబద్ధం చెప్పడం లేదు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. యాక్టర్‌గా 32 ఇయర్స్‌ అని ఆయన అంటున్నారు. ‘‘14 ఆగస్టు 1986లో నేను హీరోగా నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. మంగళవారంతో నాకు ఇండస్ట్రీలో 32 ఏళ్లు ముగిశాయి.

ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్‌ చేయడంతో పాటు అభిమానించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని వెంకీ అన్నారు. ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు వెంకీ ఫొటో షేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో జాయిన్‌ అయ్యారు. ‘‘సౌత్‌లో హీరోయిన్‌గా నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలై అప్పుడే 32 ఏళ్లు కంప్లీట్‌ అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలాను చూశా. అండగా ఉన్నవారికి థ్యాంక్స్‌’’ అన్నారు ఖుష్బూ.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top