అసలు ఇంటి నుంచి బయటకే వెళ్లలేదు: విక్కీ

Vicky Kaushal Dismisses Breaking Lockdown Rumours - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించలేదని బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ పేర్కొన్నారు. అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించి పోలీసులకు పట్టుబడ్డాడని సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను విక్కీ కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన విక్కీ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘించానని పోలీసుల చేతిలో తన్నులు తిన్నానని వస్తున్నవార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి అవి అవాస్తవాలు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటినుంచి కాలు బయట పెట్టలేదు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి అబద్దపు వార్తలు ప్రచారం చేయకండి’. అంటూ ట్వీట్‌ చేశాడు. (కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు)

భారత్‌లో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విక్కీ తన కుటుంబంతో ముంబైలో క్వారంటైన్‌లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అలుపెరగకుండా, నిస్వార్థంగా పని చేస్తున్న​ పోలీసులకు విక్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇంట్లో సరదాగా వంటలు చేస్తున్న ఫోటోలను, సోదరుడు సన్నీ కౌశల్‌ సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో తరచుగా షేర్‌ చేస్తున్నారు. అలాగే కరోనా పోరుకు ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి కోటి రూపాయల విరాళం అందజేశారు.
(ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు : సంపూ )

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top