తిరున్నాళ్ల సందడి!

Venky Mama release date locked - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య ఏం చేస్తున్నారో తెలుసా? తిరునాళ్లల్లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ అంతా బోనాల సందట్లో ఉంది. మామాఅల్లుడు కూడా బోనాల పండగలో మునిగి తేలుతున్నారు. ఏ ఏరియాలో అంటే హైదరాబాద్‌ శివార్లలో వేసిన తిరునాళ్ల సెట్టింగ్‌లో. ‘వెంకీమామా’ చిత్రం కోసం వేసిన ఈ సెట్‌లో మామాఅల్లుడు వెంకీ, చైతూ జోరుగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కె.యస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

చిత్రంలోని కీలక తారాగణంతో పాటు ఐదువందల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. తిరునాళ్ల సందట్లో మామాఅల్లుడు ఫైట్‌ కూడా చేయాల్సి వస్తుందట. ఫైట్‌మాస్టర్‌లు రామ్‌–లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ ఫైట్‌ చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top