ఆన్‌ ట్రాక్‌ | Venky Mama Launch Date Confirmed | Sakshi
Sakshi News home page

ఆన్‌ ట్రాక్‌

Jul 7 2018 12:39 AM | Updated on Jul 7 2018 12:39 AM

Venky Mama Launch Date Confirmed - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

జస్ట్‌ మూడు రోజులు.. అంతే. మామా అల్లుళ్లు రంగంలోకి దిగుతారు. ఎందుకు అంటే? సినిమా కోసం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌  రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. అంటే ఆ రోజు నుంచీ మామా అల్లుళ్లు ఆన్‌ ట్రాక్‌ అన్నమాట. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు ‘వెంకీ మామా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌. రియల్‌ లైఫ్‌ మాదిరిగానే ఈ సినిమాలో మామా అల్లుళ్ల పాత్రల్లో నటించనున్నారట వెంకీ అండ్‌ చైతూ. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్‌’ సినిమాలో వెంకీ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. మామా అల్లుళ్లు సినిమాలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement