
ఇటు మీరా... అటు చంద్రముఖి.. మధ్యలో మిస్టర్!
ప్రేమను వెతుక్కుంటూ చాలా చోట్లకు వెళతాడు చై. కానీ, ప్రేమే ఇతణ్ణి వెతుక్కుంటూ వస్తుంది.
ప్రేమను వెతుక్కుంటూ చాలా చోట్లకు వెళతాడు చై. కానీ, ప్రేమే ఇతణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. ఆ ప్రేమే ఇద్దరమ్మాయిలను దగ్గర చేస్తుంది. అటు మీరా, ఇటు చంద్రముఖి.. ఈ ప్రేమ ప్రయాణంలో చై మనసు ఎవర్ని కోరుకుందనే కథతో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్’. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. ఏప్రిల్ 1 నుంచి ఇటలీలో తెరకెక్కించే పాటతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.
అదే నెలలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించి, 13న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘మనసును హత్తుకునే భావోద్వేగాలు, చక్కటి ప్రేమకథ, వినసొంపైన సంగీతం... ఫ్యామిలీ అంతా కలసి చూసే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, కెమేరా: కేవీ గుహన్, స్టైలింగ్: రూపా వైట్ల, సంగీతం: మిక్కి జె. మేయర్, సమర్పణ: బేబీ భవ్య.