'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..! | Varun Tej Training Up for New look for Up coming Movie | Sakshi
Sakshi News home page

'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..!

Sep 17 2017 9:07 PM | Updated on Nov 6 2018 4:55 PM

'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..! - Sakshi

'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..!

ఫిదా ఇచ్చిన కిక్‌ నుంచి అప్పుడే బయటకు వచ్చేసినట్లున్నారు హీరో వరుణ్‌ తేజ్‌.

ఫిదా ఇచ్చిన కిక్‌ నుంచి అప్పుడే బయటకు వచ్చేసినట్లున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. తన తర్వాతి ప్రాజెక్టు కోసం తెగ కసరత్తులు చేసేస్తున్నారాయన. ట్రైనర్‌తో కలసి జిమ్‌లో ఉన్న ఫొటోను తన ట్విటర్‌ అకౌంట్లో పోస్టు చేశారు వరుణ్‌. ‘ లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమిస్తున్నా. సగం సాధించా’  అని ట్వీట్‌లో పేర్కొన్నారు. తదుపరి చిత్రం కోసం వరుణ్‌ దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

వరుణ్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఇంకా సినిమాకు పేరు నిర్ణయంచలేదు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌ కోడై కూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement