న్యూ ఇయర్కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్ | varun Tej Srinuvaitla Mister teaser launch | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్

Dec 31 2016 11:21 AM | Updated on Sep 5 2017 12:03 AM

న్యూ ఇయర్కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్

న్యూ ఇయర్కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్

ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు

ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు కూడా చేరిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్ల దుమ్ముదులుపుతున్నాయి. రేసులోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్లతో హవా చూపిస్తున్నాడు.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ రేసులోకి అడుగుపెట్టాడు. కొత్త ఏడాదికి రెండు రోజుల ముందే తన కొత్త సినిమా మిస్టర్ టైటిల్ లోగోను రిలీజ్ చేసిన వరుణ్, న్యూ ఇయర్ రోజు టీజర్ను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్కు చాలా సమయం ఉండటంతో సంక్రాంతికి ట్రైలర్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement