
వరుస విజయాలతో ఊపుమీదున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఆయన హీరోగా తెరకెక్కిన ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ అద్భుతమైన విజయాలు సాధించాయి. భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నెక్ట్స్ ఈ సినిమా ఏమిటన్నది ఆసక్తి నెలకొంది. అయితే, వరుణ్ మరోసారి ఒక యువ దర్శకుడికే అవకాశమిచ్చారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘తొలిప్రేమ’ వంటి మంచి హిట్ అందుకున్న వరుణ్.. ఇప్పుడు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సాగర్ చంద్రకు తన నెక్ట్స్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు.
సాగర్ చంద్ర దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని, ఈ సినిమాను 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మించబోతున్నారని వరుణ్ ట్విట్టర్‌లో తెలిపారు. ఉగాది పర్వదినాన ఈ శుభవార్త అభిమానులతో పంచుకుంటున్నట్టు తెలిపారు.
నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో యువ దర్శకుడు సాగర్ చంద్ర మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విభిన్నమైన కథతో ప్రేక్షకుల మెప్పు పొందిన నేపథ్యంలో మెగాహీరో వరుణ్ నుంచి ఆయనకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
Good news on a good day! pic.twitter.com/pS5ggxd1bz
— Varun Tej (@IAmVarunTej) 18 March 2018