వాళ్ళిద్దరి ప్రేమ | valliddari madhya movie shooting completed | Sakshi
Sakshi News home page

వాళ్ళిద్దరి ప్రేమ

Jun 1 2020 3:33 AM | Updated on Jun 1 2020 3:43 AM

valliddari madhya movie shooting completed - Sakshi

విరాజ్‌ అశ్విన్‌ , నేహా కృష్ణ

విరాజ్‌ అశ్విన్‌ , నేహా కృష్ణ హీరో హీరోయిన్లుగా వి.ఎన్‌. ఆదిత్య దర్శకత్వంలో వేదా¯Œ ‡్ష క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అర్జున్‌  దాస్య¯Œ  నిర్మించిన చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ సినిమాలోని ‘లత్కోరు లవ్వింతే’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌  కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఫస్ట్‌ కాపీని సిద్ధంగా ఉంచాం. నిర్మాత అర్జున్‌ గారు ఎంతో అభిరుచితో ఈ సినిమాను నిర్మించారు.

దాదాపుగా అందరూ  కొత్త ఆర్టిస్టులే అయినా 5 కోట్ల నిర్మాణ వ్యయంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు. ప్రసాద్‌ల్యాబ్‌వారు ఇన్‌ ఫ్రా పార్ట్‌నర్స్‌గా వ్యవహరించడం విశేషం’’ అని వీఎన్‌ ఆదిత్య అన్నారు. ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి చేతుల మీదుగా మా సినిమాలోని పాట విడుదల కావడం సంతోషంగా ఉంది. నిర్మాతగా నాకు ఇదే తొలి చిత్రం. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ చిత్రం ఇది’’ అన్నారు అర్జున్‌ దాస్యన్‌ . ఈ సినిమాకు మధు స్రవంతి సంగీతం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement