ఎన్టీఆర్‌తో గొడవలు లేవు | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌తో గొడవలు లేవు

Published Fri, May 4 2018 5:07 PM

Vakkantham Vamsi Says No Issues With Junior NTR - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘నాపేరు సూర్య’  సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్‌’, ‘టెంపర్‌’, ‘ఎవడు’  లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు రచయితగా పనిచేశాడు.  అల్లు అర్జున్‌ కంటే ముందు వంశీ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాతో డైరెక్టర్‌గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్‌, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్‌చల్‌ చేశాయి.

వంశీ ప్రస్తుతం ఆ విషయంపై  స్పందించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్‌తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్‌ నిజం కాదు. డైరెక్టర్‌గా చేయమని  ఎన్టీఆర్‌ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. 

Advertisement
 
Advertisement